Banner
Watermark
దిగి వచ్చిన బంగారం ధరలు..
📅 18 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image

హైదరాబాద్‌, నవంబర్ 18 :
కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర మంగళవారం కిందకు దిగి వచ్చింది. ఈ రోజు (నవంబర్ 18) మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 23, 660కి చేరింది నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ. 1,740 తగ్గింది.

ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 13, 350కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ. 1,600 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుదలకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరల్లో స్థిరీకరణ జరగడమే ఈ తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది . ఇక, ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 23, 810కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 13, 500కి చేరుకుంది.ఇక, వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల నమోదైంది. కేజీకి 5,000 రూపాయల మేర వెండి ధర తగ్గింది . హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1, 70, 000గా ఉంది. ఇక, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1, 62, 000గా ఉంది.
🏠 Home