Banner
Watermark
బడ్జెట్‌ 2026–27 కోసం ప్రీ-బడ్జెట్‌ సమావేశానికి
📅 18 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image
నేతృత్వం వహించిన నిర్మలా సీతారామన్
- క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చలు
- పెట్టుబడులు–ఆర్థిక స్థిరత్వంపై కీలక సూచనలు
- మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు

న్యూఢిల్లీ, 18 నవంబర్ :
రాబోయే యూనియన్ బడ్జెట్‌ 2026–27 తయారీ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాల్గవ ప్రీ-బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. క్యాపిటల్ మార్కెట్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు, ప్రతినిధులు పాల్గొని పెట్టుబడి విధానాలు, మార్కెట్ స్థిరత్వం, పన్ను నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై తమ సూచనలు తెలియజేశారు.


ఈ సమావేశంలో యూనియన్ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కూడా పాల్గొన్నారు.

ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి అవకాశాలు, కార్పొరేట్ రంగ అవసరాలపై విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలపడే దిశగా క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే విధానాలు అవసరమని మంత్రి సీతారామన్ పేర్కొన్నట్టు సమాచారం.


రాబోయే బడ్జెట్ రూపకల్పనలో ఈ సిఫార్సులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
🏠 Home