Banner
Watermark
స్వగ్రామం చేరిన వలస జీవి మృతదేహం...
📅 20 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image
రాయికల్:నవంబర్ 19 : ఉన్న ఊళ్ళో ఉపాధి లేక,గంపెడు ఆశతో నాలుగు పైసలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించాలని విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస జీవి శవపేటికలో శవమై బుధవారం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాయికల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య అలియాస్ తోట ధర్మయ్య సౌదీ అరేబియా దేశంలో జెద్దాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధర్మయ్య పొట్ట చేత పట్టుకుని 10 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు.అప్పటి నుండి అక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే పని చేసుకుని రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందాడని తోటి కార్మికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.కాగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ,సాటా కోర్ టీం సభ్యులు సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సహాయంతో హైదరాబాద్ నుండి రాయికల్ వరకు ఉచిత అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకురావడానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ధర్మయ్య అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను వారు చూసుకున్నారు.మృతుడికి భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు.నిరుపేద మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ,కోర్ టీం సభ్యులు కోరుతున్నారు.

సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చను సాటా కోర్ టీం సభ్యులు మల్లేశన్, శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, ముదిగొండ శంకర్, మహ్మద్ నూరుద్దీన్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, దూడం సంజీవ్, పళ్ళికొండ సంజీవ్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, యోగేష్ బాబు, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్, మహమ్మద్ కమిల్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
🏠 Home