హైదరాబాద్, నవంబర్ 17 : షార్ట్-టర్మ్ ఆరోగ్య బీమా కవరేజీని కల్పిస్తుంది. సాధారణంగా ఇది కొద్ది నెలల నుంచి ఏడాదిదాకే ఉంటుంది. ఎవరైతే స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య బీమాలు కాకుండా తక్షణ కవరేజీలను కోరుకుంటారో వారినుద్దేశించినదే ఈ పాలసీ. సమగ్ర కవరేజీని కొనలేనివారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కంపెనీల్లో గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగులు, నిరుద్యోగులకు దీని అవసరం ఎక్కువని చెప్పవచ్చు.
లాభాలు:
-తక్కువ ప్రీమియం
-కనీస ఆరోగ్య సమాచారంతోనే కొనుగోలు
-సులభంగా ప్లాన్ల మార్పు
నష్టాలు:
-ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు నో కవరేజీ
-ఎంపిక చేసిన నెట్వర్క్లో తప్ప.. అన్ని దవాఖానల్లో చెల్లవు
-యాడ్-ఆన్లు అందుబాటులో ఉండవు
Also Read:
ముంపు పునరావాస గ్రామ కమిటీ ఏక గ్రీవ ఎన్నిక.