60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు,2 మ్యాక్స్ స్వాధీనం
అక్రమంగా మద్యం అమ్ముతున్నటువంటి 3 బెల్ట్ షాపు ల జప్తు
*గంజాయి, మదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచన.*
*ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాల నిర్వహణ చట్టరీత్యా నేరం.*
*వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి.*
*ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ ల నిర్వహణ*
*సిసి కెమెరాల ప్రాధాన్యత పై వివరణ.*
*70 మంది సిబ్బందితో ఉదయం 5 గంటల నుండి తనిఖీలు.*
-ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్రవర్ధన్

Adilabad: ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) లను నిర్వహించడం జరుగుతుందని ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్రవర్ధన్ తెలిపారు. ఉదయం ఐదు గంటల నుండి 70 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, రెండు మ్యాక్స్ వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం అమ్ముతున్నటువంటి మూడు బెల్ట్ షాపులను జప్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు.ప్రజలు యువత వాహనాలలో ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటి ఏర్పాటకు కృషి చేయాలని తెలిపారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ఉండాలని ఎలాంటి గృహహింస చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవిటీజింగ్ మరియు మహిళలను వేధించడం లాంటివి నిర్వహించకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి సోషల్ మీడియా పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ లు కె ఫణిదర్ , కె నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లో టీ మురళి, ఎన్ చంద్రశేఖర్, రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్, ఎస్ఐలు డి రాధిక, జీవన్ రెడ్డి, రాకేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.